తెలంగాణ ఉద్యమ సమయంలో TG అని రాశారంటే కారణం దేవేందర్ గౌడే : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ ఉద్యమ సమయంలో TG అని రాశారంటే కారణం దేవేందర్ గౌడే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని జలవీహార్ దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంతో సమానమైన అధికారాన్ని వదులుకొని తెలంగాణ కోసం దేవేందర్ గౌడ్ ముందుకు వచ్చారని గుర్తు చేశారు. టీజీని తొలుత దేవేందర్ గౌడ్ నిర్ణయించారు. అందుకే తాము అధికారంలోకి వచ్చాక టీజీనే ఉండాలని అమలు చేశామని చెప్పారు. ఉద్యమ సమయంలో బైకులపై యువత, గుండెలపై కూడా టీజీ అనే రాసుకున్నారని గుర్తుకు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. టీఎస్ ను టీజీగా మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మార్పు పై సీఎం రేవంత్ రెడ్డి ప క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ చరిత్ర కోసం లండన్ తరహా మ్యూజియం రావాలని అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ తెలంగాణ చరిత్ర కాదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version