జైనూర్ లో ప్రస్తుత పరిస్తితి ప్రశాంతంగా ఉంది అని లాండ్ అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు. రెండు వర్గాల వారితో వేర్వేరుగా సమావేశం నిర్వహించాం. ఉన్న సిబ్బందితో పోలీసులు శాయశక్తుల కృషి చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గాయాలు సైతం ఎవ్వరికి కాలేదు. ప్రస్తుతం 144/163 అమలులో ఉంది. ఉదయం నుంచి అధికారుల తో మాట్లాడాను. ఇన్వెస్టిగేషన్ అధికారిగా కాగజ్ నగర్ డిఎస్పీని నియమించాం.
చట్టం పని చట్టం చేస్తుంది. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాము. జరిగిన సంఘటనలో సూత్ర దారులు ఎవ్వరో విచారణలో తేలుతుంది. ఆ మహిళ పై లైంగిక దాడి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తగిన శిక్ష పడేలా చేస్తాం. ధ్వంసం అయిన షాప్ లు, వాహనాల అంచనా వేస్తున్నారు. ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం అని మహేష్ భగవత్ అన్నారు.