BJP 400 సీట్లు రాకపోతే…అయోధ్య మందిరానికి తాళం వేస్తారు – ధర్మపురి అరవింద్

-

BJPకి 400 సీట్లు రాకపోతే…అయోధ్య మందిరానికి తాళం వేస్తారని నిజామాబాదు బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపూరి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రం లో ని అన్నపూర్ణ చౌరస్తా వద్ద నిజామాబాదు బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ….బీజేపీ కి 400 సీట్లు రాకుంటే అయోధ్య మందిరానికి బాబ్రీ తాళం వేస్తారన్నారు.

Dharmapuri Arvind about ayodhya

ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారని… 75 ఏళ్ల వయస్సు ఉన్న జీవన్ రెడ్డి… సిమి, పీఎఫ్ ఐ ఉగ్రవాదులతో కలిసి టోపీలు పెట్టుకొని ధర్నాలు చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి మన హిందూ దేశాన్ని ఇస్లామిక్ దేశం చేయాలని కుట్ర చేస్తున్నారని…. జగిత్యాల సిమీ, PFI కి అడ్డగా మారిందన్నారు. రాహుల్ గాంధీ తాత పేరు ఫెరోజ్ జహంగీర్ రాహుల్ “గాంధీ” ఎట్లా అయ్యాడో చెప్పాలన్నారు. జూన్ 4 తర్వాత ఒకే దేశం- ఒకే చట్టం అమల్లోకి వస్తుందని…తెలిపారు. ప్రేమ వ్యవహారంతో హిందు మహిళలపై ముస్లింలు దాడులు చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version