నాకు ఫోన్ లేదు…నాకు నంబరే లేదని పేర్కొన్నారు సీఎం జగన్. టీవీ9 ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ మాట్లాడుతూ…నాకు ఫోన్ లేదు…నాకు నంబరే లేదన్నారు. ఏదైనా అవసరం వస్తే..పక్కనే పీఏలు ఉంటారు.. అన్ని వాళ్లే చూసుకుంటారని వివరించారు. నాకు ఫోన్ వాడే అవసరం రాలేదని వివరించారు జగన్.
నాకు ప్రైవేట్ లైఫ్ అంటూ ప్రత్యేకంగా లేదు…. పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటే అని వెల్లడించారు. అందరితో సత్సంబంధాలు ఉండాలని నేను ఆశిస్తానన్నారు సీఎం జగన్. కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇస్తే బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు తప్పవన్నారు. నా ఓటు బ్యాంక్ ను చీల్చాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహించారు. షర్మిల ద్వారా లబ్దిపొందాలని చూస్తున్నారు… ఎన్నికలయ్యాక షర్మిల స్టాండ్ ఏంటో తెలుస్తుందని స్పష్టం చేశారు సీఎం జగన్.