Hyd: రోడ్డుపై డీజిల్ లీక్.. ఒకరి మృతి.. జారిపడ్డ 70 మంది వాహనదారులు!

-

 

 

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ రోడ్డు పైన డీజిల్ లీక్ అయి.. ఏకంగా ఒకరు మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయం అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని కుషాయిగూడ డీమార్ట్ నుంచి నాగారం వరకూ రోడ్డుపై డీజిల్ లీక్ అయింది.

ఈ సంఘటన నేపథ్యంలో.. దాదాపు 60 నుంచి 70 మంది వాహనదారులు జారిపడ్డారు. ఒకరు మృతి చెందగా .. మరో మహిళ తలకు తీవ్ర గాయం అయింది. ఈసీఐఎల్ నుంచి కీసర వెళ్లే ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని పోలీసులు సూచనలు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రొటెక్షన్ కూడా పెట్టారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

https://x.com/TeluguScribe/status/1862899845301756120?t=oi9g7hRpdAQ4XaxP2Q8ATQ&s=09

 

Read more RELATED
Recommended to you

Exit mobile version