మ‌న వైద్యం : ఏపీకీ టీజీకీ అదే తేడా !

-

ఏపీలో సాధార‌ణ ప్ర‌స‌వాల అనంత‌రం త‌ల్లీ బిడ్డ‌ల క్షేమం కోరి ఐదు వేలు రూపాయ‌లు ఇస్తున్నారు. ఇది ప్ర‌భుత్వాస్ప‌త్రుల‌కే ప‌రిమితం. అదేవిధంగా సిజేరియ‌న్ చేయించుకున్న త‌ల్లుల‌కు మూడు వేలు ఇస్తున్నారు. ఈ మొత్తం ఇప్పుడు ఐదు వేలు చేశారు. పేద‌లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సీఎం జ‌గ‌న్ చెబుతున్నారు.

ఇదంతా బాగుంది కానీ ఆస్ప‌త్రి ప్ర‌స‌వాల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో స‌హ‌జ ప్ర‌సవాల‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఎప్ప‌టి నుంచో వైద్యులు చెబుతున్నారు. అంటే స‌హ‌జ ప్ర‌సవాల‌కు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తే ప్ర‌సావ‌నంత‌రం కూడా తల్లి ఆరోగ్యం బాగుండ‌డ‌మే కాకుండా అన‌వ‌స‌ర ఇబ్బందుల‌కు ఆమె గురి కాకుండా ఉంటార‌న్న‌ది వైద్యుల ఆలోచ‌న. ఈ ఆలోచ‌న ప్ర‌కారం తెలంగాణ‌లో స‌హ‌జ ప్ర‌స‌వాలు చేసే వేళ సబంధిత ఆశ వ‌ర్క‌ర్ల‌కు కానీ ఏఎన్ఎంల‌కు కానీ వైద్యుల‌కు కానీ మూడు వేలు రూపాయ‌లు జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాల‌ని అక్క‌డి వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు నిర్ణ‌యించి ఆ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు ఇటీవల. ఈ ప్రక‌ట‌నపై అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణ‌లోనూ మంచి స్పంద‌నే వ‌చ్చింది.

కానీ ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం కారణంగా స‌హ‌జ ప్ర‌స‌వం కు అయినా సిజేరియ‌న్ కు అయినా త‌ల్లీ బిడ్డ‌ల క్షేమం కోరి ఇచ్చే మొత్తం స‌మాన‌మే అని తేలిపోయింది. మ‌రి! స‌హ‌జ ప్ర‌స‌వాల‌కు జ‌గ‌న్ అందించే ప్రోత్సాహం సిబ్బంది ప‌రంగా ఏమీ ఉండ‌దా అన్న‌ది ఓ ప్ర‌శ్న. ఇప్ప‌టికే సిజేరియ‌న్ల పేరిట లెక్కకు మిక్కిలి ఆప‌రేషన్లు అయిపోవ‌డం త‌రువాత ఆస్ప‌త్రి చుట్టూ బాలింత‌లు ప్ర‌దక్షిణ‌లు చేయ‌డం స‌ర్వ సాధార‌ణంగా జ‌రుగుతోంది. అలా కాకుండా గ‌ర్భం దాల్చిన వెంటనే స‌హ‌జ ప్ర‌స‌వం చేయించుకునే దిశగా ఆశ వ‌ర్క‌ర్లు కానీ ఏఎన్ఎంలు కానీ హెల్త్ అసిస్టెంట్లు కానీ కొంత మోటివేట్ చేస్తే ఆడ‌బిడ్డ‌ల‌కు కడుపు కోత కొంత త‌గ్గుతుంది.

ప్ర‌స‌వం స‌హ‌జంగా జ‌రిగితే ఆప‌రేష‌న్ ఒత్తిడి లేకుండా పోయి త‌రువాత జీవితం ఇవ‌న్నీ కూడా సాఫీగా సాగిపోతుంది. అంటే ఇప్పుడు చేయాల్సింది ఏంటి స‌హ‌జ ప్ర‌సవాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం.. రెండు ఆ దిశ‌గా సిబ్బందిని ప్రోత్స‌హించమ‌ని చెప్ప‌డం.. త‌రువాత ఆ విధంగా ప్రోత్స‌హించి నార్మ‌ల్ డెలివ‌రీ చేసిన సిబ్బంది ఇన్సెంటివ్ ఇవ్వ‌డం.. వీటిని కూడా గౌర‌వ సీఎం దృష్టిలో ఉంచుకుంటే మేలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version