బొగ్గు గనిలో పేలుడు.. ఏడుగురు మృతి..!

-

పశ్చిమ బెంగాల్ బీర్ భూమ్ లోని బొగ్గుగనిలో సంభవించిన పేలుడులో ఏడుగురు
మృతి చెందారు. మరికొందరికి గాయాలవ్వగా.. రెస్క్యూ టీమ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
గంగారాంచక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కోలిరీలో బొగ్గును తవ్వి తీసేందుకు పేలుళ్లు నిర్వహించిన
సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడున్నవారిలో కొందరు వెల్లడించారు.

పేలుడు తర్వాత.. ప్రమాద స్థలంలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉండటంతో ఆ ప్రాంతం అంతా భయానక వాతావరణం నెలకొంది. ఇక ఈ పేలుడు తీవ్రతకు అక్కడున్న వాహనాలు కూడా కొన్ని దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా ఇదే తరహా పేలుడు జరగ్గా.. ఆ సమయంలో కూడా ఇక్కడ  ఏడుగురు మరణించారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ అప్పటి పేలుడుకి కారణమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version