భారీ మోసాలకు పాల్పడుతున్న నిత్య పెళ్ళికొడుకు అరెస్టు..!

-

ఇస్రో HR ఉద్యోగిగా పరిచయం చేసుకుంటూ భారీ మోసాలకు పాల్పడుతున్న నిత్య పెళ్ళికొడుకు అరెస్టు అయ్యాడు. ఇప్పటివరకు  మ్యాట్రిమోనీల ద్వారా నాలుగు వివాహాలు చేసుకున్నాడు ఆశం అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డి. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం బంగారు పేట కి చెందిన నిందితుడు.. తొమ్మిదో తరగతి చదివి ఇస్రో HR ఉద్యోగిగా పరిచయం చేసుకుంటున్నాడు అనిల్ బాబు.

పెళ్లి కూతుళ్లు కుటుంబంలో చదువుకున్న వారికి ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తానని ఘరానా మోసాలకు పాల్పడ్డాడు. తనకు వంద ఎకరాల పొలం, హైద్రాబాద్ ,బెంగళూరులో రెండు విల్లాలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి పెళ్లి కూతుళ్ళ కుటుంబ సభ్యులకి ఎర వేస్తాడు.  విల్లాలు, బౌన్సర్లు, కార్లు  అద్దెకు తీసుకుని, పెళ్లిచూపులు సమయంలో అద్దెకు బంధువులను తీసుకువచ్చి  మోసాలకు పాల్పడుతుంటాడు. పెళ్లికూతురు కుటుంబ సభ్యులకు ఇస్రో లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇప్పటివరకు కోటిన్నర పైగా వసూలు చేశాడు నిందితుడు అనిల్.. చుట్టుపక్కల విల్లాల వారిని కూడా నమ్మించాడు కేటుగాడు.  నిందితుడికి సహకరించిన తుంగ శశాంక, డ్రైవర్ పల్లె హేమంత రెడ్డి కూడా  అరెస్టు అయ్యారు. మోసపోయి న పెళ్లి కూతుర్లలో శశాంక ఒకరు.. ఆమెను HR మేనేజర్ గా పరిచయం చేసే నిందితుడు..నిందితుడి నుంచి రెండు లక్షల నగదు ఒక కారు, ఐదు మొబైల్ ఫోన్లు..రెండు లాప్టాప్ లు. చెక్కులు ఫేక్ అపాయింట్మెంట్లు స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version