సుప్రీం కోర్టులో నేడు వనమా వెంకటేశ్వర రావు అనర్హత కేసు విచారణ జరుగనుంది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు వనమా వెంకటేశ్వరరావు. ఈ తరుణంలోనే.. సుప్రీం కోర్టులో నేడు వనమా వెంకటేశ్వర రావు అనర్హత కేసు విచారణ జరుగనుంది.
ఇక ఇప్పటికే తెలంగాణకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఈసి. గత విచారణ లో వనమా కు స్టే ఇచ్చింది సుప్రీం కోర్టు ధర్మాసనం.ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఇవాళ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం వనమా కేసును విచారణ చేయనుంది.
కాగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ మేరకు నిన్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం తో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే నిన్న ఎన్నికలపై ప్రకటన చేయడంతో… తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.