ఆరు రాష్ట్రాలకు తెలంగాణ యూరియా పంపిణీ చేస్తోంది. రామగుండం ఎరువుల కర్మాగారం 6 రాష్ట్రాల అన్నదాతలకు బాసటగా నిలుస్తోంది. 2023-24లో సెప్టెంబర్ వరకు 5.71 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి కాగా… అందులో 2.22 లక్షల టన్నులు సరాఫరా చేశారు.
ఆ తర్వాత కర్ణాటకకు 1.13 లక్షల టన్నులు, APకి 77 వేల టన్నులు, TNకు 53,000 టన్నులు, MH కు 54 వేల టన్నులు, చత్తీస్గడ్ కు 48వేల టన్నులు సరాఫరా చేశారు. రూ. 6300 కోట్లతో ఏర్పాటైన RFCL…. Q1లో రూ.86 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
కాగా,తెలంగాణ ఆడపడుచులకు కేసీఆర్ సర్కార్ బతుకమ్మ కానుకగా ప్రతి ఏటా అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే 80 శాతం చీరలు పంపిణీ కేంద్రాలకు చేరాయి. పండుగ సమీపిస్తున్న వేళ ఆడపడుచులకు చీరలు అందజేసేందుకు రాష్ట్ర సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది బతుకమ్మ చీరలు 250 డిజైన్లలో రూపొందించారు. చేనేత సంఘాల ఆధ్వర్యంలో రూ.354 కోట్లతో 1.02 కోట్ల చీరలను సిద్ధం చేశారు.