ASIAN GAMES 2023: ఆఫ్గనిస్తాన్ చేతిలో శ్రీలంక ఘోరపరాజయం… !

-

చైనా వేదికగా గ్యాంగ్జౌ లో జరుగుతున్న ఆసియన్ గేమ్స్ లో భాగంగా పురుషుల క్రికెట్ లో ఇప్పటికే రెండు క్వార్టర్ ఫైనల్స్ ముగియగా… ఇండియా మరియు పాకిస్తాన్ లో సెమిఫైనల్ కు అర్హత సాధించాయి. ఇక ఈ రోజు ఉదయం జరిగిన మూడవ క్వార్టర్ ఫైనల్ లో శ్రీలంక మరియు ఆఫ్గనిస్తాన్ లు తలపడగా , టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది.. అనంతరం మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ 18 .3 ఓవర్ లలో 116 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. నూర్ అలీ జద్రాన్ (51) ఒక్కడే అర్ద సెంచరీ చేసి జట్టుకు ఆ మాత్రం స్కోర్ అయినా సాధించి పెట్టాడు. ఇథనాయికి షహీదుల్లా (23) నుండి మంచి సహకారమే లభించింది.. ఇక శ్రీలంక బౌలర్లలో తుషార 4 వికెట్లు మరియు అరాచిగే రెండు వికెట్లు తీసి ఆఫ్ఘన్ వెన్ను విరిచారు. ఇక ఆఫ్ఘన్ ఇచ్చిన 117 పరుగులు లక్ష్యాన్ని చేధించే క్రమంలో శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలిపోయింది.

శ్రీలంక ను గుల్బాదిన్ నైబ్ 3 మరియు కయీస్ అహమద్ 3 తీసి సెమీఫైనల్ కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఏ ఒక్క ఆటగాడు శ్రీలంక ను విజయం దిశగా తీసుకెళ్లలేకపోయాడు.. అనూహ్యంగా ఓడిపోయినా శ్రీలంక క్వార్టర్స్ లోనే ఇంటి దారి పట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news