బీఆర్ఎస్ లో రావుల చంద్రశేఖర్ రెడ్డి చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. రావుల అజాత శత్రువు కు నిజమైన పర్యాయ పదం అన్నారు. నేను రావుల కు కండువ కప్పి ఆహ్వానించడం నా అదృష్టం గా భావిస్తాను. రాష్ట్రం లో సరికొత్త విప్లవం ఆవిష్కృతమైంది. దసరా పండగ రోజూ ఊరూరా చర్చ పెట్టండి. ఇంత అభివృద్ధి గతం లో ఎపుడైనా జరిగిందా చర్చించండి. ప్రభుత్వ ఫలాలు అందని మనిషి రాష్ట్రం లో ఎవ్వరూ లేరు. ఓటేసేప్పుడు అన్నీ ఆలోచించండి.
రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అనే అంశం చాలా కీలకమైనది ..ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రేవంత్ రెడ్డి పుట్టు పూర్వోత్తరాలు పాలమూరు ప్రజలకు తెలుసు అన్నారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉంది రేవంత్ తీరు అన్నారు. మన కంటిని మనమే పొడుచుకోవద్దు. బీఆర్ఎస్ కార్యకర్తలు lic ఏజెంట్లలా ప్రజలను ఒప్పించాలి. ఒక్కొక్క ఓటు పోగు చేసి కేసీఆర్ కు ఓట్ల దీవెన అందించాలి.