కేవలం స్టడీ కోసమే.. 4వేల కోట్ల స్కామ్ ఏంటి : బొత్స కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీ ఒప్పందాన్ని జనసేన పార్టీ తప్పుపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. తాజాగా విద్యారంగంపై ప్రభుత్వ విధానం ఏంటో తెలియకుండా విమర్శనాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. దీనికి జనసేన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఐబి ఒప్పందంపై మళ్ళీ విమర్శలు చేస్తున్నారు. ఐబి ఒప్పందంలో ఏదో స్కాం జరిగిందని ఆరోపణలు చేశారు. ఫైనాన్స్, న్యాయ విభాగాలు అభ్యంతరం తెలిపిన ఒప్పందం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అసలు పేదలకు నాణ్యమైన విద్య అందకూడదనేనా.. ఆ సెలబ్రిటీ పార్టీ ఉద్దేశం అంటూ పేర్కొన్నారు.

ఐబి తో కుదుర్చుకున్న ఒప్పందంలో ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. కేవలం ఇంటర్నేషనల్ కార్క్యులం కోసం స్టడీ చేయడమే ఒప్పందంలో ఉన్న సారాంశం. కేవలం స్టడీ చేయడం కోసం ఒప్పందం చేసుకుంటే.. 4000 కోట్ల స్కామ్ ఏంటి వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశంలో విద్యారంగము చాలా ప్రధానమైందని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని ఇటీవలే కొందరు విద్యారంగంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news