కాళ్లు, చేతులు విరిచినా మీ బుద్ధి మారదా ? సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

-

బడ్జెట్ లో అప్పుల లెక్కలు చెబుతున్న హరీశ్ రావు.. వారి హయాంలో అమ్ముకున్న లెక్కలు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలన నిజాయితీగా సాగి ఉంటే మీరు గొప్ప పథకాలు అని చెబుతున్న బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపకాలు పథకాలపై విచారణకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు.

శాసనసభలో బడ్జెట్ పై  చర్చ సందర్భంగా ఇవాళ ఆయన సభలో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో అనేక పథకాలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాళ్లు, చేతులు విరిచేసినా.. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఉరితీసినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్ తో కూడుకున్న బతుకమ్మ చీరల విషయంలో అవినీతి జరిగిందని.. చేనేతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తే.. దానిని పల్లి బఠానీ మాదిరిగా రూ.7వేల కోట్లకు తెగనమ్మారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version