తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్న పిల్లల విషయం లో బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. సెకండ్ షోకు పిల్లల్ని అనుమతించొద్దు అని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ‘పుష్ప 2’ తొక్కిసలాట నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలను రా.11 నుంచి ఉ.11 గంటల వరకు అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది హైకోర్టు. ప్రభుత్వమే నిజాయితీగా నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా మా ఆదేశం వర్తిస్తుందని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.