మేడారం, ఇతర జాతరలకు టికెట్‌ వసూలు చేయవద్దు – భట్టి

-

తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. జాతరలకు వెళ్లే ప్రయాణికులకు చార్జీలు వసూలు చేయకూడదని ఆయన కోరారు. మేడారం సహా ఇతర జాతరలకు వెళ్లే మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణాన్ని తొలగించి టికెట్ వసూలు చేస్తామని ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తిరస్కరించారు.

Deputy CM Bhatti Vikramarka inspected the officials of TS REDCO

ఎట్టి పరిస్థితుల్లో నూ ఉచిత ప్రయాణం విధానం అమలు చేయాల్సిందేనని ఆదేశించారు. ఆ ఖర్చు అంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో అస్సలు వెనుక అడుగు వేయకూడదని ఆర్టీసీ యాజమాన్యానికి సూచించారు. కాగా ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మేడారం జాతర జరుగుతుంది. ఈ నేపథ్యంలో మేడారం జాతర కోసం ఏకంగా ఆరువేల బస్సులను ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. ఇక తాజాగా భట్టి విక్రమార్క చేసిన ప్రకటనతో… మేడారం జాతర తో పాటు ఇతర జాతరలకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగనుoదన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news