మార్చి 17వ తేదీకి వంద రోజులు నిండుతుంది. అంతలోపు ఎన్నికల కోడ్ వస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ కు డెడ్ లైన్ అన్నారు. మహిళల విషయంలో ఒకే హామీ అమలు చేసి అన్నీ అమలు చేశామంటే ఏలా ? ఒక్క మహిళలకు మూడు హామీలు ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారు..
ఇప్పటికైనా వివరణ ఇవ్వండి ఎప్పటి నుండి అమలు చేస్తారో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పాలని ఫైర్ అయ్యారు. ఎన్నికల కోడ్‌కు ముందే హామీలు అమలు చేయకపోతే దాటవేసినట్లే అని చెప్పారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి పట్ల మీ బాషా అలాగే ఉంటుందా ? తెలంగాణా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తగిన గుణపాఠం చెబుతారని మండిపడ్డారు. హామీలు అమలు చేయాలని కోరుతున్నామని.. ప్రజలు మీరిచ్చిన బాధ్యత మీరు నిర్వర్తించండన్నారు. మాకిచ్చిన బాధ్యత మేం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.