తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది. గ్రామపంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన సర్పంచుల పదవీకాలం ముగియనుంది.
ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఈనెల 29వ తేదీన జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12, 777 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో తహసిల్దార్లు, ఏ ఈ ఓ లు, హెడ్మాస్టర్లు, ఎంఈఓ లు, స్కూల్ అసిస్టెంట్లు, అలాగే జూనియర్ అసిస్టెంట్లను… ప్రత్యేక అధికారులుగా నియామకం చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.