బొంబాయ్, దుబాయ్ వెళ్లొద్దు; హరీష్ కీలక వ్యాఖ్యలు…!

-

ఇప్పుడు తెలంగాణాలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయి. ప్రభుత్వం సాగునీరు అందించడంతో రైతులు అందరూ కూడా పంటను భారీగా సాగుచేసారు. దీనితో రాబడి గణనీయంగా పెరిగింది. ఇదిలా ఉంటే సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని కోదండరావు పల్లి, లక్ష్మీదేవి పల్లెలో రంగనాయక సాగర్ ప్రధాన ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలతో గ్రామాల్లోని చెరువులు నిండతంతో అక్కడి గ్రామస్తులు మంగళహారతులు, బోనాలు, డప్పు చప్పుళ్లతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బొంబాయి, దుబాయ్ పోవుడు వద్దు బాయి కాడికే పోయి గుంటేడు పొలం ఉన్నా పని చేసుకుందామని హరీష్ రైతులకు విజ్ఞప్తి చేసారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం జలాలతో ఆంజనేయ స్వామి విగ్రహానికి బిందెడు నీళ్లతో అభిషేకం చేయడంతో నా జన్మ ధన్యమైందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గోదావరి జలాలతో పంటలు పండించే శుభ గడియలు ఇవాళ్టితో ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

కాళేశ్వరం నీళ్లతో ప్రతి ఎకరం బంగారంలా పంటలు పండిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ప్రతి పంట పండటం, చేతి నిండా పని దొరకడమే బంగారు తెలంగాణకు నిదర్శనమని అన్నారు. ఇక నుంచి రైతులు రంది పడొద్దని, కాళేశ్వరం జలాలతో కాలంతో, కరెంటుతో సంబంధం లేకుండా సంవత్సరానికి రెండు పంటలు తీయొచ్చని ఆయన సూచించారు. గతంలో లక్ష్మీదేవి పల్లె మిరపతోనే తొక్కులు పెట్టేవారని, గత వైభవాన్ని తిరిగి చాటి చెప్పేలా మిరప పంటలు పండించి లక్ష్మీతో.. కళకళలాడే లక్ష్మీదేవి పల్లె కావాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news