తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ డిగ్రీ కాలేజీలలో ప్రవేశాలకు ఇవాల్టి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. ఇంటర్ ఉత్తీర్ణులు అయినా విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ తో వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచనలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 908 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇందులో మూడు దశలలో సీట్లు కేటాయించబోతున్నారు. ఇంటర్మీడియట్ లో మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. జూన్ 30వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కాబోతున్నాయి.
ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, జెఎన్‌టీయూహెచ్, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 3 విడతల్లో ప్రవేశాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.అందుకోసం ‘దోస్త్’ వెబ్‌సైట్, మొబైల్ యాప్, మీసేవ యాప్, మీసేవ కేంద్రాలకు వెళ్లి అప్లయ్ చేసుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచించారు.