BREAKING : తెలంగాణలో ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదల

-

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ ఇవాళ విడుదలైంది. మే 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మొదటి ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. రూ.200 రుసుంతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. మే 15 నుంచి 27 వరకు ‘దోస్త్‌’ వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్‌ 3వ తేదీన మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్‌ 4వ తేదీ నుంచి 10వ తేదీ లోపు సెల్ఫ్‌ రిపోర్టుకు అవకాశం కల్పించారు.

‘దోస్త్‌’ నోటిఫికేషన్లో మరికొన్ని ముఖ్య అంశాలు ఇవే..

  • మే 6 తేదీ నుంచి మే 25 వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్
  • రూ. 200 రుసుంతో ‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్‌కు అవకాశం
  • మే 15 నుంచి మే 27 వరకు ‘దోస్త్‌’ వెబ్ ఆప్షన్లకు అవకాశం
  • జూన్ 3న ‘దోస్త్‌’ మొదటి దశ సీట్ల కేటాయింపు
  • జూన్ 4 నుంచి 10లోపు ‘దోస్త్‌’ సెల్ఫ్ రిపోర్టుకు అవకాశం
  • జూన్ 4 నుంచి జూన్ 13 వరకు ‘దోస్త్‌’ సెకండ్‌ ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌
  • రూ. 400 రుసుంతో ‘దోస్త్‌’ సెకండ్‌ ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌కు అవకాశం
  • జూన్ 4 నుంచి జూన్ 14 వరకు దోస్త్ సెకండ్‌ ఫేజ్‌ వెబ్ ఆప్షన్లు
  • జూన్ 18న ‘దోస్త్‌’ రెండో దశ సీట్ల కేటాయింపు
  • జూన్ 19 నుంచి 24 వరకు ‘దోస్త్‌’ సెల్ఫ్‌ రిపోర్ట్‌కు అవకాశం
  • జూన్ 19 నుంచి 25 వరకు ‘దోస్త్‌’ మూడో దశ రిజిస్ట్రేషన్‌
  • రూ. 400 రుసుంతో ‘దోస్త్‌’ మూడో రిజిస్ట్రేషన్‌కు అవకాశం
  • జూన్ 19 నుంచి 25 వరకు దోస్త్‌ మూడో దశ వెబ్ ఆప్షన్లు
  • జూన్ 29న ‘దోస్త్‌’ మూడోదశ సీట్ల కేటాయింపు
  • జులై 8 నుంచి డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభం
  • ఈ ఏడాది నుంచి డిగ్రీలో అందుబాటులోకి 2 కొత్త కోర్సులు
  • డిగ్రీలో కొత్తగా బీకాం ఫైనాన్స్, బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కోర్సులు

Read more RELATED
Recommended to you

Latest news