దోస్త్ సీట్ల కేటాయింపులపై కీలక ప్రకటన వచ్చింది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ పూర్తయింది. 54,048 మంది విద్యార్థులకు సీట్లను కేటాయించారు. కామర్స్ లో 22,328 మంది, ఫిజికల్ సైన్స్ లో 12,211 మంది, లైఫ్ సైన్స్ 10,435 మంది, ఆర్ట్స్ కోర్సుల్లో 8,979 మంది సీట్లను సొంతం చేసుకున్నారు. వీరంతా ఈనెల 8లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచనలు జారీ చేశారు.
Degree [/caption]
ఈ సంవత్సరం మొత్తం 1.97 లక్షల మంది డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లను పొందినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా…. బోర్డు పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులకు 70 శాతం హాజరు తప్పనిసరి ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెల్లడించింది. అటెండెన్స్ రికార్డులు సరిగ్గా లేకపోయినా, విద్యార్థులు రెగ్యులర్ గా స్కూలుకు రాకపోయినా పాఠశాలలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా అత్యవసర ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే స్కూళ్లకు సెలవు తీసుకోవాలని స్పష్టం చేశారు.