”స్త్రీశక్తి” పథకం అమలుకు ముందే ఆటో డ్రైవర్లతో సమావేశం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లయితే ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారన్న అభిప్రాయాలపై స్పందించారు. డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ఆటో డ్రైవర్లకు తగిన సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఫ్రీ బస్సు పథకం ప్రారంభోత్సవంలో మంత్రులు అందరూ తప్పకుండా పాల్గొనాలని చంద్రబాబు నాయుడు సూచించారు. కాగా ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కానుంది. దీంతో ఏపీలోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి డబ్బులు లేకుండా వారి గమ్యస్థానాలకు చేరుకోవచ్చని సంతోషపడుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత బస్సు పథకాన్ని రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని మహిళలు ఎలాంటి చార్జీలు లేకుండా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా ఈ పథకం తీసుకురావడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.