బోర్డు పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరి ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించింది. అటెండెన్స్ రికార్డులు సరిగ్గా లేకపోయినా, విద్యార్థులు స్కూల్లకు క్రమం తప్పకుండా రావడంలేదని తెలిసిన పాఠశాలలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హెచ్చరించింది.
అత్యవసర పరిస్థితులు, మెడికల్ ఎమర్జెన్సీలు, జాతీయ/ అంతర్జాతీయ స్పోర్ట్స్ లాంటి కారణాలతో స్కూల్లకు హాజరుకాని వారికి 25 శాతం సడలింపు ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాఠశాలలు అలర్ట్ గా ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఇదిలా ఉండగా… డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ ను పూర్తి చేసింది. సీట్లను పొందిన విద్యార్థులు ఈనెల 8 లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థు లకు కేవలం ఒక రోజు మాత్రమే సమయం మాత్రమే ఉంది.c