తెలంగాణలో రిలీవైన IASల అధికారుల స్థానాల్లో సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమ్రపాలి స్థానంలో GHMC కమిషనర్‌గా ఇలంబర్తి నియామకం అయ్యారు. వాకాటి కరుణ స్థానంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా శ్రీదేవి నియామకం అయ్యారు. రోనాల్డ్ రోస్ స్థానంలో ఎనర్టీ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా ఫైనల్ అయ్యారు.
శ్రీధర్, ప్రభుత్వ కార్యదర్శి SCD, YAT&C శాఖకు, ఆర్కియాలజీ డైరెక్టర్‌గా అదనపు భాద్యతలు అప్పగించారు. సందీప్‌కుమార్ సుల్తానియా, ప్రభుత్వ కార్యదర్శి ఆర్థిక శాఖకు ఇంధన శాఖ, సీఎండీ, జెన్కో & ట్రాన్స్‌కో అదనపు భాద్యతలు అప్పగించారు. డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, ప్రభుత్వ కార్యదర్శి హెచ్ఎం&ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్కు ఆయుష్ డైరెక్టర్‌గా అదనపు భాద్యతలు దక్కాయి.