నేను కాంగ్రెస్‌లో చేరడంలేదు: డి. శ్రీనివాస్

-

నేను కాంగ్రెస్‌లో చేరడంలేదని డి. శ్రీనివాస్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. మాణిక్ రావు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని వార్తలు వచ్చాయి.

ధర్మపురి శ్రీనివాస్ తో పాటు ఆయన కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై డి. శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. నేను కాంగ్రెస్ లో చేరడం లేదు, నేను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. నా కొడుకు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్నారు, సంజయ్ కి నా అభినందనలు…నా ఆరోగ్యం సహకరిస్తే గాంధీ భవన్ కు వెళ్లి సంజయ్ ని ఆశీర్వదిస్తానని చెప్పారు డీఎస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version