తెలంగాణ సీఎం రేవంత్ కు షాక్ తగిలింది. ప్రజా భవన్ లో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనకు దిగారు. 2008 dsc అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి జీవో నెంబర్ 9 తెచ్చి క్యాబినెట్ అప్రూవల్ కూడా చేసి ఒక్క సంవత్సరం నడుస్తున్న కూడా ఇప్పటివరకు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆందోళన చేస్తున్నారు నిరుద్యోగులు.
సెప్టెంబర్ నెలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయడం వల్ల మా ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు ఊడి గత మూడు నెలల నుండి రోడ్డు మీద ఉన్నామని చెబుతున్నారు. మీరు చేసిన ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వల్ల మా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి ఆత్మహత్యలకు దారి తీసే విధంగా ఉన్నదని అంటున్నారు. గతంలో ఎన్నడు కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగి 100 రోజులు అయినా కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు లేదంటున్నారు. కాబట్టి దయచేసి మా విన్నపాన్ని వెంటనే ఆలకించి ఒక వారంలో ఉద్యోగాలలో చేరే విధంగా చేయాలని అభ్యర్థులు అభ్యర్థన చేస్తున్నారు.