దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్‌ మరో వీడియో రిలీజ్‌

-

దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్‌ మరో వీడియో రిలీజ్‌ చేసింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు చేసేంతవరకు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళను అంటూ వీడియో విడుదల చేసింది శేజల్. ప్రస్తుతం అబిడ్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చిన్నయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని 6 నెలలుగా పోరాటం చేస్తున్నానని…ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆగ్రహించింది.

మూడు రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నారని.. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయండి అంటే ఆధారాలు అడుగుతున్నారని పేర్కొన్నారు శేజల్‌. వేధించే అప్పుడు కెమెరాలు పట్టుకొని ఉంటారా అంటూ ఫైర్‌ అయింది. ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం ఎన్ని కుటుంబాలను బలిచేస్తారని.. నాకేం అయినా అయితే ఎవ్వరు పట్టించు కుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే చిన్నయ్య పై ఎఫ్ ఐ ఆర్ అయ్యే వరకు అబిట్స్ పోలీసు స్టేషన్ వద్ద నుంచి కదలనని శేజల్ పేర్కొంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news