రైతు బంధుకు ఈసీ బ్రేక్.. కేసీఆర్ రియాక్షన్ ఇదే..!

-

రైతుబంధు నిధుల పంపిణీ కి తొలుత పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు అర్ధాంతరంగా నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీని అంటూ బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ షాద్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో వ్యాఖ్యానించారు. రైతుబంధును పొందుతున్న లబ్ధిదారులు కాంగ్రెస్ కి చెందినవారు కూడా ఉన్నారు కదా అది ఆగిపోతే వారు కూడా నష్టపోతారు కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు డబ్బు వేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చానన్నారు. కాంగ్రెస్ ఫిర్యాదుతో ఈసీ మళ్ళీ నిలిపివేసింది అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గుమానం ఉందా..? మీరు రైతులేనా..? అన్నదాతల నోటి కాడ కూడు ఎత్తగొడతారా..? ధరణీ తీసేస్తామని కాంగ్రెస్ లో మీరు ఎలా తిరుగుతారు.

టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడారు. రైతుబంధు ఆగిపోవడం వెనక కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదన్నారు. ఆ పార్టీ వల్లనే ఆగిపోయిందని తాను అనడం లేదని వ్యాఖ్యానించారు. రైతుబంధు నిధుల విడుదలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈసీ విధించిన నిబంధనలకు ఎవరైనా విరుద్ధంగా మాట్లాడితే వారికి నోటీసులు ఇవ్వాలి గాని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సమంజసం కాదని కేశవరావు పేర్కొన్నారు. రైతుబంధు అను గోయింగ్ స్కీమ్ అయినప్పుడు ఎలాంటి నోటిస్ ఇవ్వకుండా నిధుల పంపిణీ ప్రక్రియ ఎలా బ్రేక్ వేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఈసీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని మంగళవారం వరకు ఈ ఉత్తర్వులు ఉపసంహరించుకునేలా చూస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version