‘ఔను వాళ్లిద్దరూ ఒక్కటే’.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలపై ఈటల

-

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే తాను ముక్కలు అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టేందుకే హైదరాబాద్ లో సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఎన్ని మీటింగులు పెట్టినా ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటే రాజకీయానికే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతిస్తోందని మండిపడ్డారు.

‘తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయినా ముందే కొందరు కావాలని అపోహలు సృష్టిస్తూ రాద్ధాంతం చేస్తున్నారు. ఇలాంటి వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అసలు దేశంలో ఏం జరుగుతుందో అవగాహన కలిగి ఉండాలి. మోదీ పాలనలో దేశంతో పాటు రాష్ట్రాలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్నది అవాస్తవం. అభివృద్ధి లోపించిన ప్రాంతాలకు ఎక్కువ సాయం అందించడం తప్పేం కాదు. తెలంగాణకు నిధులు తగ్గించారన్న ఆరోపణలు నిరాధారం.’ అని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news