ఉప్పల్ శిల్పారామంలో జరిగిన రాఖీ పండుగ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అలాగే మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. నన్ను రక్షించు అని చెబుతూ సోదరుడికి రాఖీ కడుతుంది సోదరి. దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలి. పది రోజుల యుద్ధంలో రావణుడిని రాముడు చంపేశాడు. లంకలోకి లక్ష్మణుడు వెళ్లినప్పుడు మన భూమి కంటే లంకా బాగుంది అంటే.. మన భూమి మనకు అమ్మ లాంటిది అని రాముడు చెప్పాడు. మన భూమి.. మన సంస్కృతిని ఎప్పుడు మర్చిపోవద్దు. మనమంతా ఒక్కటే.. మనమంతా సమానమే.. మన సంస్కృతులన్నీ ఒక్కటే. మన సోదరినే కాదు సమాజాన్ని రక్షిస్తాం అని ప్రతిజ్ఞ చేద్దాం రండి అంటూ గవర్నర్ పేర్కొన్నారు.
అలాగే ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. భాషలు.. ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులం. పరాయి మనిషి ఆపదలో ఉంటే ఆదుకునేది భారత్. దేశానికి రక్షణ ఉన్నప్పుడే మనమంతా ప్రశాంతంగా ఉంటాం అని పేర్కొన్నారు.