ఎన్నికల్లో ప్రలోభాలపై ఈసీ ఫోకస్.. విస్తృత తనిఖీలు.. మూడ్రోజుల్లో పట్టుబడిన సొత్తు విలువ రూ.10కోట్లు

-

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతూ లెక్కలు, పత్రాలు లేని డబ్బు, బంగారం, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసుల వాహనాల తనిఖీల్లో రోజూ లక్షల కొద్దీ నగదు, బంగారం సహా ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. కేవలం మూడ్రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 కోట్ల విలువైన నగదు, బంగారం పట్టుబడింది.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 5 కోట్ల నగదు, ఏడు కిలోలకు పైగా బంగారం.. హైదరాబాద్ కుల్సుంపుర ఠాణా పరిధిలో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి 600 గ్రాముల బంగారం.. చైతన్యపురి పోలీసుస్టేషన్‌ పరిధిలో 60 లక్షలు.. మహంకాళి ఠాణా పరిధిలో ఐదుగురు వ్యక్తుల దగ్గర నుంచి 29 లక్షల విలువైన 55 తులాల బంగారం.. దోమలగూడ, గాంధీనగర్‌ పోలీస్ స్టేషన్ల పరిధిలో కారులో  తరలిస్తున్న కేజీ బంగారంతో పాటు రెండు లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మూడు కమిషనరేట్ల ఉన్నతాధికారులు, సిబ్బందితో కమిషనర్లు సమావేశాలు నిర్వహిస్తూ.. 24 గంటలు పని చేసేలా ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు లేదా ఇతర ప్రలోభాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news