ఎన్నికల గుర్తులపై దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన BRS ప్రతినిధులు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి కారును పోలిన గుర్తులతో కొత్త తలనొప్పి షురూ అయింది. ఇతర పార్టీలకు కారు గుర్తును పోలి ఉండే ఫ్రీ సింబల్స్ కేటాయించటంపై పార్టీలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల గుర్తులపై బీఆర్ఎస్ ప్రతినిధులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

brs party

 

కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయిస్తే తమ పార్టీకి నష్టమని పిటిషన్​లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది మోహిత్ రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై నేడు దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనునుంది.

ఇంతకుముందే ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లారు.
తెలంగాణలో యుగ తులసి పార్టీకి రోడ్ రోలర్ గుర్తును కేటాయించడంపై బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. కారు, రోడ్ రోలర్ ఒకే రకంగా ఉంటాయని ఈవీఎంలలో అవి ఒకే రకంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. దీనివల్ల ఓటర్లు, ప్రత్యేకించి గ్రామీణ నేపథ్యం ఉన్న వృద్ధులు, దృష్టిలోపం ఉన్నవారు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. గతంలో జరిగిన ఎన్నికల్లో జాతీయ పార్టీలకంటే ఎక్కువ ఓట్లు రోడ్డు రోలర్ గుర్తుకు పడ్డాయని కొన్ని ఉదాహరణలను ఉటంకించారు.

Read more RELATED
Recommended to you

Latest news