80 ఏళ్లు దాటిన వారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగం: ఈసీ

-

తెలంగాణలో ఎన్నికల హడావుడి షురూ అయింది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఓవైపు ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటుంటే.. మరోవైపు ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటివద్దే ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ సదుపాయాన్ని కోరుకున్నవారికి ముందస్తుగా పోస్టల్‌బ్యా లెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగానికి అవకాశం కల్పించాలని త్వరలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారమిచ్చింది.

80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు ఇంటినుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తై అభ్యర్థులు ఖరారైన మీదట పోస్టల్‌ బ్యాలెట్లు సిద్ధం చేస్తారు. ఇంటి నుంచి ఓటువేసే వారికి సంబంధించి ప్రత్యేక రంగులో బ్యాలెట్‌పత్రం రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సదుపాయం కావాలనుకునే వారు లిఖిత పూర్వకంగా ఆప్రాంత ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అలా చేస్తేనే.. ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు వేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news