తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. నేడు 11 గంటల తర్వాత తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. నిన్న కస్టడీ పిటిషన్ పై సీఐడీ, చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును 5 రోజుల కస్టడీ కోరింది సీఐడీ. అటు కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఇక దీనిపై నేడు 11 గంటల తర్వాత తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. తీర్పుపై సర్వత్రా అసక్తి నెలకొంది. ఏసీబీ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాగా, నిన్న స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్లపై సుమారు మూడు గంటలకు పైగా వాడీ వేడి వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అటు చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్‌లు వాదనలు వినిపించారు.