ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు అయింది. ఏకంగా రూ.1700 కోట్ల స్కాం చేసిన కేసులో ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు అయింది. హైదరాబాద్ కేంద్రంగా వెలుగు లోకి వచ్చిన ఫాల్కన్ స్కాంపై ఈడి దర్యాప్తు చేసింది. 1700 కోట్ల రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టిన ఫాల్కన్… ఒక్క హైదరాబాదులోనే 850 కోట్లు రూపాయలు వసూలు చేసింది. పెట్టుబడి దారుల నుంచి వసూలు చేసిన డబ్బులని విదేశాలకు మళ్లించినట్లు ఇచ్చినట్లు గుర్తించింది ఈ డి.

తక్కువ మొత్తాన్ని కి ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ప్రచారం చేసింది ఫాల్కన్. పెట్టుబడులను ప్రముఖ కంపెనీలో పెట్టి వచ్చిన లాభాన్ని పంచుతామంటూ ప్రచారం జరుగుతోంది. 22 షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నగదు మళ్ళించినట్లు గుర్తించారు. దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు డబ్బులను పంపించినట్లు గుర్తించింది ఈడి. ఇక కేసు నమోదు కాగానే చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్ కి పారిపోయాడు చైర్మన్ అమర్దీప్ కుమార్. విదేశాలకు పారిపోయిన నిందితుల కోసం ఎల్ఓసి జారీచేసింది సైబరాబాద్ పోలీసులు.