తెలంగాణ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 22 లేదా 23న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల వ్యవహారంలో ఆయనపై భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే అమోయ్ కుమార్ కి నోటీసులు పంపించింది ఈడీ.
గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పని చేశాడు అమోయ్ కుమార్. ఆ సమయంలో భూ కేటాయింపుల్లో అవకతవకలు పాల్పడ్డాడని ఈడీకి ఫిర్యాదులు అందాయి. రూల్స్ కి వ్యతిరేకంగా అయోయ్ ప్రభుత్వ భూములు కేటాయించారని ఈడీకి ఫిర్యాదు అందింది. ఆయన పై వచ్చినటువంటి ఫిర్యాదులన్నింటీనీ చెక్ చేసిన తరువాత ఈడీ అమోయ్ కుమార్ కు నోటీసులు పంపింది. మేడ్చల్ జిల్లా నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. మాదాపూర్, మోఖిలా, శేరిలింగంపల్లిలోని ప్రభుత్వ భూములను అమోయ్ కుమార్ నిబంధనలకు కేటాయించారని ఫిర్యాదులు అందాయి.