తెలంగాణ కేబినెట్ భేటీ ఈనెల 23న జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ జరగాల్సిన కేబినెట్ భేటీ ఈనెల 26వ తేదీకి వాయిదా పడింది. ఈ నెల 26న 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయం భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో డిజిటల్ హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు, మూసీ పునరుజ్జీవం, ధరణి స్థానంలో భూమాత పోర్టల్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఒక ఎకరానికి రూ. 15 వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రైతు భరోసా మార్గదర్శకాలు
రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ చేసింది. వివిధ వర్గాలతో చర్చలు జరిపిన
కేబినెట్ సబ్ కమిటీ.. రైతు భరోసా గైడ్ లైన్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కేబినెట్ భేటీలో
చర్చించే అవకాశం ఉంది.