ఎన్నికల అఫిడవిట్‌ వ్యవహారంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు

-

ఇటీవల బీఆర్ఎస్ నేతల చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా కోర్టు కేసులు ఎక్కువగా ఈ నేతలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవలే కొత్తగూడెం బీఆర్ఎస్ నేత వనమా వెంకటేశ్వర రావు శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్నికల అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌ వ్యవహారంలో రాష్ట్ర పర్యాటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై కేసు నమోదైంది. మంత్రితో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులు, పలువురు ఐఏఎస్​లు, రెవెన్యూ అధికారులపై మహబూబ్‌నగర్‌ రెండో పట్టణ ఠాణా పోలీసులు మొత్తం 21 సెక్షన్లతో కేసు నమోదు చేశారు.

గతంలోనే ఆదేశాలు ఇచ్చినా.. కేసు నమోదులో జాప్యంపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాటకీయ పరిణామాల మధ్య కేసు నమోదైంది. మంత్రితో పాటు భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌, ఎన్నికల కమిషన్‌ అప్పటి కార్యదర్శి సంజయ్‌కుమార్‌.. 2018 ఎన్నికల సమయంలో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు శశాంక్‌ గోయల్,  రొనాల్డ్‌రాస్‌, జె.శ్రీనివాస్‌, కె.వెంకటేశ్‌గౌడ్‌, ఎ.పద్మశ్రీ, ఎస్‌.వెంకట్‌రావు, న్యాయవాది రాజేంద్రప్రసాద్‌, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి డి.సుధాకర్‌లపై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version