గత కొంతకాలంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక శుక్రవారం నుంచి ఈ ప్రచారం కాస్త ఇంకొంచెం ఎక్కువే జోరందుకుంది. ఇక దాదాపుగా పార్టీ విలీనం ఖాయమైనట్టేనని వినిపించింది. కానీ చివరి నిమిషంలో షర్మిల మౌనం వహించడంతో విలీనంపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
‘షర్మిలను మనస్ఫూర్తిగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నాను. వైఎస్‌ఆర్ కుమార్తెగా షర్మిలకు కాంగ్రెస్‌లో ఆహ్వానం ఉంటుంది. షర్మిల వల్ల 4 ఓట్లు వచ్చినా.. 400 ఓట్లు వచ్చినా పార్టీకి లాభమే. షర్మిల చేరికపై పార్టీ హైకమాండ్ అడిగినప్పుడు ఈ విషయమే చెప్తాను. ఒకరికొకరు కలిసి బలపడాలి.. కాంగ్రెస్ ఇదే భావిస్తోంది. షర్మిలను చేర్చుకోవాలనేదే నా అభిప్రాయం. కాంగ్రెస్‌లో తండ్రికి ఉన్న గౌరవం కుమార్తెకూ ఉంటుంది.’ అని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు.