తూచ్‌ ఎలక్షన్ కోడ్‌ ఉంది.. ఈ నెలలో నో జీరో బిల్

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా గృహజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టింది. మార్చి నెలలో జీరో బిల్లులు కూడా జారీ చేసింది. ఇక కరెంట్ బిల్లు కట్టనవసరం లేదని సంబురపడిపోతున్న ప్రజలకు ఈనెలలో మాత్రం షాక్ ఇచ్చింది. గత నెల జారీ చేసిన సున్నా బిల్లులన్నింటిని వెనక్కి తీసుకుంది. జీరో బిల్లు మొత్తాన్ని బకాయిలుగా చూపుతూ ఈ నెల బిల్లులో కలిపి వినియోగదారుడికి అందించి షాక్ ఇచ్చింది. సరూర్‌నగర్‌ సర్కిల్‌ అల్మాస్‌గూడలో ఓ  వినియోగదారుడికి మార్చి 2న జారీ చేసిన బిల్లులో గృహజ్యోతి రాయితీ రూ.262 చూపి సున్నా బిల్లు జారీ చేశారు. ఈ నెల రూ.547 బిల్లుకు సున్నా బిల్లు బకాయి కలిపి రూ.809 చెల్లించాలని బిల్లు జారీ చేశారు.

‘సాంకేతిక సమస్య కారణంగా స్పాట్‌ బిల్లింగ్‌ యంత్రం మార్చిలో సున్నా బిల్లు జారీ అయ్యింది. ఎన్నికల కోడ్‌తో రంగారెడ్డి, వికారాబాద్‌లో గృహజ్యోతి పథకం ప్రారంభించలేదు. దీంతో ఈ నెల ఎలక్ట్రానిక్‌ బిల్లింగ్‌ సిస్టమ్‌(ఈబీఎస్‌) ప్రకారం సాధారణ బిల్లు జారీ అయ్యింది’ అని డిస్కం అధికారులు చెప్పడంతో వినియోగదారుడు షాక్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news