తెలంగాణ మంత్రిమండలి సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 4వ తేదీన హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సమావేశం జరుగనుంది. కాళేశ్వరం కమిషన్ సమర్పించిన రిపోర్ట్ప మంత్రివర్గం చర్చించనుంది. కాగా, ఇప్పటికే కాళేశ్వరం నివేదిక సీఎం రేవంత్ వద్దకు చేరింది.

శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిటీ సమర్పించిన నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు. ఇదే సమయంలో నివేదిక అధ్యయనానికి ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. నివేదికను అధ్యయనం చేసి ముఖ్య సారాంశానికి కేబినెట్ కి సమర్పించనుంది.