బీసీ రిజర్వేషన్ల పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహా ధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇద్దామనుకునే 42 శాతం రిజర్వేషన్లు  బీసీలకు కాదు.. మతపరంగా ఓట్ల కోసం కాంగ్రెస్ తెచ్చిన కోటా అని ఆరోపించారు. గతంలో 34 శాతం రిజర్వేషన్లు ఉంటే.. వాటిని కేసీఆర్ 23 శాతానికి తగ్గించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ 42 శాతం అంటూ మరో మోసానికి తెరలేపింది. 42 శాతంలో 10 శాతం ముస్లింలకు తీసేస్తే బీసీలకు మిగిలేది ఎంత అని ప్రశ్నించారు. బీసీలకు 32 శాతం కూడా దక్కడం లేదని అన్నారు.

Kishan Reddy

34 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఇప్పుడు ఎందుకు తగ్గించారని అడిగారు. బీసీలకు అన్యాయం చేసే చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొస్తోందని ఆరోపించారు. అందుకే కులగణన కూడా సరిగా చేయలేదని అన్నారు. హైదరాబాద్ లో 20 శాతం ఇళ్లలో కూడా సర్వే చేయలేదని చెప్పారు. అంతేకాదు.. కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క బీసీ వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిని చేయలేదని గుర్తుచేశారు. యూపీఏ పదేళ్లు అధికారంలో ఉన్నా బీసీ కులగణన చేయలేదని అన్నారు. దీనిపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో ముక్కు నేలకు రాసిన తర్వాతనే కులగణనపై మాట్లాడాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news