మీ ఫోన్‌కూ ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చిందా?

-

దేశవ్యాప్తంగా మొబైల్‌ యూజర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ పంపిన ఎమర్జెన్సీ అలర్ట్ సందేశం చూసి యూజర్లు కలవరపడ్డారు. మొబైల్‌ ఫోన్లలో ఆపే వరకూ అలారమ్‌ సౌండ్‌ మోగుతూనే ఉంది. అకస్మాత్తుగా వచ్చిన అలర్ట్ మెసేజ్ చూసి ఇది ఏ సైబర్ అటాకో లేదా తమ మొబైల్ హ్యాక్ అయిందేమోనని భయపడ్డారు. ఎమర్జెన్సీ అలర్ట్‌ ఎందుకు వచ్చిందో అర్థంకాక వినియోగదారులు కంగారుపడ్డారు. కానీ అందులో ఉన్న సందేశం చదివిన తర్వాత ఊపిరిపీల్చుకున్నారు. ఈ మెసేజ్​ను కేంద్ర సర్కార్ పంపినట్టు సమాచారం. ఎమర్జెన్సీ అలర్ట్‌ టెస్టింగ్‌లో భాగంగా మెసేజ్‌ వచ్చినట్లు తెలిసింది.

ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్టింగ్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థకు పంపబడింది. మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రజా భద్రత మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలు అందిస్తాయి.’ అని మెసేజ్​లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version