మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో పకడ్బందిగా అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రణాళిక బద్ధంగా పనులు చేయించాలని సూచించారు. రైతుల ఆదాయం పెంచేలా. ఉపాధి హమీ నిధులతో వ్యవసాయ అనుబంధ పనులకు ప్రధాన్యత ఇవ్వాలన్నారు. శాశ్వతంగా నిలిచేలా ఉపాధి హమీ పనులు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలో MGNREGS అమలు పై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు.
సచివాలయంలో తన చాంబర్ లో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, కమీషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమీషనర్ షఫిఉల్లా, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, పంచాయతీ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ కనకరత్నం, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క బేటి అయ్యారు. రాబోయే 5 నెలల కాలానికి సంబంధించి రూ. 1372 కోట్ల MGNREGS లో నిధులతో చేపట్టే పనుల ప్రణాళికలకు ఆమోదం తెలిపారు.