వచ్చే ఏడాది నుంచి ‘ఇంజినీరింగ్‌’కు కొత్త ఫీజులు

-

తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులకు అలర్ట్.  వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్‌తోపాటు ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ తదితర ఉన్నత విద్యా కోర్సులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి.  2025-26 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రావాల్సి ఉన్నందున టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎ.గోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి హరిత, జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.వెంకటేశ్వరరావు, ఓయూ రిజిస్ట్రార్‌ ఆచార్య లక్ష్మీనారాయణ తదితరులు కొత్త మార్గదర్శకాలపై చర్చించారు.

 

ఈ నెలాఖరుకు టీఏఎఫ్‌ఆర్‌సీ నుంచి నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఆగస్టు తొలి లేదా రెండో వారం నుంచి కళాశాలల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. ఆయా కళాశాలలు గత 2-3 విద్యా సంవత్సరాల ఆదాయ, వ్యయాలను కమిటీకి సమర్పించిన తర్వాత ఆయా కళాశాలల ప్రతినిధులను పిలిచి ప్రాథమికంగా నిర్ణయించిన ఫీజును తెలియజేస్తారు. ఏమైనా అభ్యంతరాలు చెబితే వాటిని పరిగణనలోకి తీసుకొని రుసుమును ఖరారు చేస్తారు. ఆ ఫీజుల వివరాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదానికి పంపిస్తారు. అనంతరం ప్రభుత్వం జీవో జారీచేస్తేనే కొత్త రుసుములు అమల్లోకి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version