టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా SSMB29కు సంబంధించిన అధికార ప్రకటన కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రం గురించి ఒక్క అప్డేట్ అయినా వస్తే బాగుండు అని ఎంతో ఆతృతతో ఉన్నారు. ఎంతో కాలం నుంచి ఈ న్యూస్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు ఓ సూపర్ న్యూస్. అదేంటంటే..?
ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయ్యారట. ఈ చిత్రానికి సంబంధించి ఆరోజు తొలి ప్రెస్‌మీట్ పెట్టి ఆ మీట్ లోనే మూవీ కాన్సెప్ట్ వీడియోను కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను రాజమౌళి మూడు భాగాలుగా తీయనున్నారట. తొలి భాగంలో మహేశ్ కథానాయకుడు కాగా, మిగతా రెండు భాగాల్లో మహేశ్‌తోపాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా యాడ్ అవుతారని నెట్టింట్లో టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం.