మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…దేశంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో 500 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు…తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పథకం ద్వారా 2016 రూపాయల పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు.
మన సీఎం కెసిఆర్ నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు…మన రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు..ఆసరా పెన్షన్లు దాదాపు అర కోటి మందికి ఇస్తున్నామని తెలిపారు.
దేశంలో పెన్షన్లు వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రమే ఇస్తున్నారు…కానీ, మన రాష్ట్రంలో బీడీ కార్మికులకు, వితంతువులకు, hiv, బోదకాలు బాధితులకు, తాజాగా డయాలిసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్న మహానుభావుడు కెసిఆర్ అని కొనియాడారు. పెన్షన్ల వయో పరిమితిని 57 ఏండ్ల కు తగ్గించి ఇస్తున్నారు..మనమంతా సీఎం కెసిఆర్ గారికి రుణపడి ఉండాలన్నారు.