తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కోడంగల్ లో ఇది ఏర్పాటు కానుంది. కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. మూడు బీటెక్ బ్రాంచీల్లో 180 సీట్లు ఉన్నాయి. ఇక్కడ పాలిటెక్నిక్ తరగతులు యధాతధంగా కొనసాగుతాయి.
ఇది ఇలా ఉండగా, నేడు సచివాలయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళతారు. విదేశి పర్యటన తరువాత మొదటి సారి సచివాలయంకు సీఎం రేవంత్ రెడ్డి వెళుతున్నారు. భారీ పెట్టుబడులు దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన జరిగింది. ఇక ఇవాళ పెట్టుబడులను తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ఈ మేరకు ఇవాళ లేదా రేపు ముఖ్యమంత్రి రేవంత్ మీడియా సమావేశం ఉంటుంది.