కేటీఆర్ ని సీఎం చేయడానికి సీఎం కేసీఆర్ ఏమైనా చేస్తారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

-

గజ్వేల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేటీఆర్ ని సీఎం చేయడానికి సీఎం కేసీఆర్ ఏమైనా చేస్తారు అని తెలిపారు. 20 ఏళ్ళు కేసీఆర్ అడుగులో అడుగేసిన తనని అడ్డు వస్తానని బయటికి గెంటేశారు. మంత్రి హరీష్ రావును కూడా అదే గతి పట్టేది..అల్లుడు కాబట్టి బచాయించిండు.. బయటివాడిని కాబట్టి నన్ను నెట్టేసిండు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్.

కేసీఆర్ అనుమతి లేకుండా చీమ కూడా చిటుక్కుమన్నది. గతంలో నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. కేసీఆర్ ని కాదని.. పని చేసే సత్తా మంత్రి హరీశ్ రావుకు ఉందా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ మంత్రులు అందరూ అతని బానిసలు స్వతంత్రంగా పని చేయలేరని వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ప్రచారాన్ని కొనసాగించారు. సీఎం కేసీఆర్ పై గజ్వెల్ పై పోటీకి దిగారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version